వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద నకిలీ పోలీస్ హల్‌చల్.. పట్టుకున్న పోలీసులు

వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద నకిలీ పోలీస్  హల్‌చల్.. పట్టుకున్న పోలీసులు

వరంగల్: ఓరుగల్లు శ్రీ భద్రకాళి దేవాలయం వద్ద తాను పోలీస్ అధికారినంటూ ఓ వ్యక్తి హల్‌చల్ చేసిన ఘటన కలకలం రేపింది. పోలీస్ అధికారినంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దేవాలయం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఆ వ్యక్తి వ్యవహారశైలిపై అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో అతడు నకిలీ పోలీస్ అధికారిగా అనుమానించారు.  

ఈ ఘటనపై భద్రకాళి ఆలయం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారా? నిందితుడి వివరాలు ఏమిటి? అనే అంశాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.